-->

Daily Devotion : ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును


Good Morning …! Praise the LORD …!

నేటి ధ్యానము సామెతలు 16 : 2  నుండి తీసుకోబడింది  ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును




నేటి ప్రపంచంలో, చాలా మంది ప్రజలు వారు వాస్తవానికి తప్పు చేస్తున్నప్పుడు వారు నిజం అంగీకరించరు ఎందుకంటే వారు చెస్తునది వారికి తప్పు అనిపించదు . ఈరొజు చాల మంది వారి జీవితం లొ విఫలమవుతునరు గల కారనం వారు చెసెది మంచిది అని అనుకొవడం వలన . కొన్ని సార్లు మనం చెసది తప్పు అయెన కూడ మన కళ్ళకు మంచిగ అనిపిస్థాది . అందుకె వక్యాము లొ చెపినటు మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది ఉండును , కాని జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును .

సామెతలు 12:15 " మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును


దేవుడు మనము జ్ఞాని వలె జీవించటాన్ని ఆశించారు. చాలామంది విశ్వాసులు సువార్త సమావేశాలు మొదలైన చెయ్యటం, సంగీతం, Music ప్లే వంటి చర్చి లో నిర్వహించడానికి బట్టి వారి కన్నులకు వారు పరిశుద్దులు అనుకుంటారు కానీ వాస్తవానికి నిజంగా దేవుని ఆత్మ యొక్క పరివర్తిన లెకపొతె అన్ని చెసిన వ్యర్ధము . యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు .

సామెతలు 21: 2 " ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.


చాల మంది పాపపు పనులు సులభంగా చెస్తారు . కాని దాని వలన కలిగె దాని గురించి అలొచించరు . అందుకె వక్యాము లొ సామెతలు 16:25 " ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.


అందుకె విశ్వాసులు, మనం చెసె పనులు అన్ని కుడ దెవుని ద్రుస్థిలొ ఎల ఉనాయొ చూసుకొని నడవలసిన అవసరం ఉంది . లేకపొతె అంతిమంగా అది మరణానికి దారితీస్తుంది."   

దేవుడు నిన్ను దీవించును గాక ! 


 క్రీస్తు సేవ లో,
షకీనా యూత్
Previous
Next Post »