Good Morning …! Praise
the LORD …!
నేటి ధ్యానం సామెతలు 16:18 నుండి తీసుకోబడింది “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు
ముందు అహంకారమైన మనస్సు నడచును”
మనలొ చాలామంది
కి ఉన్న గొప్ప సమస్యల్లో ఒకటి గర్వము, ఆలాగె అహంకార మనస్సు . గర్వము అంటె మనల్ని మనం ఎక్కువగా చూసుకోవడం అలగె అన్నింటి
లొ గొప్ప అనుకోవడం . చాల మందికి తెలియదు ఈ గర్వం మరియు అహంకారమైన మనస్సు ఎం చెస్తుందొ . వాక్యము చెప్తున్న మాట “నాశనమునకు
ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” .
ఈ గర్వము
మరియు అహంకారమైన మనస్సు మనలను నాశనమునకు తెసుకెల్తుంది. బైబిల్ చూస్తే, గోలియత్, హామాను , నెబుకద్నెజరు, బెల్షస్సరు వంటి వారు
వారి గర్వము బట్టి పతనానికి వెళ్లిపోయారు. గర్వము ఆత్మకు, మనసుకు, శరీరమునకు విషం . ఈ గర్వము వలన
మనము అవరని ప్రేమించలేము మరియు క్రమించలేము . దీని వలన మన గుండె గట్టిపడుతుంది, ఇది ప్రమాదాలను మరియు నష్టాలు మనసు చీకటి ఒక మనిషి మూర్ఖత్వమేన ఎంపికలు మరియు
నాశనం . అందుకని వాక్యము చెపుచు ఉన్న మాట సామెతలు 29:23 " ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు
ఘనతనొందును “
మన జీవితాల్లో
ఏమి ఉన్న వాటిని బట్టి దెవునికి ధన్యవాదాలు ఇవ్వడం అవసరం. మన ప్రతిభ, సామర్ధ్యాలు, మరియు బహుమతులు అవి మన స్వంత కావు . చాల మంది వారు
ఒక ఇంజనీర్, డాక్టర్, రాజకీయవేత్త, సంగీతకారుడు లేదా ఒక గాయకుడు అవధానికి వారి శ్రమ ఒకటి కరణం అనుకొని వాటికి
బట్టి గర్వము గా ఉంటారు. కానీ ఈ ప్రపంచంలోని మనము ఎం చెసని దేవుని ఆజ్య
లేకుండా ఎమి జరగదు అని మనం గ్రహించాలి.
మనలొ ఉన్న
గర్వము ని గ్రహించి దానిని బట్టి దేవుని సహాయము కొరి గర్వమును మరియు అహంకారమైన మనస్సు ను విడిచి పెట్టి వినయపూర్వకమైన స్వభావం కలిగి జీవించాలి. “దేవుడు తగిన
సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి” 1 పేతురు 5: 6.
దేవుడు నిన్ను దీవించును గాక !
క్రీస్తు సేవ లో,
షకీనా యూత్