నేటి ధ్యానం మత్తయి 22 : 39 నుండి తీసుకోబడింది “ నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”
మనకు క్రీస్తు ఇచిన రెండు గొప్ప ఆజ్ఞల లొ ఒకటి దేవునిని ప్రేమించడం రెండోది పొరుగువారిని ప్రేమించడం, కాని నీను చాల
సార్లు దేవునిని ప్రేమిస్తాను గాని నా పొరుగువారిని ప్రేమించడం లొ విఫలమయాను . మనలొ చల మంది కుడ నాలగే దేవుని ప్రేమిస్తారు కాని అదె ప్రేమ మన పొరుగువారి మిద చూపలేం . కాని వాక్యము చెప్తున్న ఉన్న మాట “ ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము. 1 యోహాను - 4 :19- 21”
మనము
మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం, మనం ఎం చేసిన నచ్చుతాది మంచి
అయిన చెడు అయిన , కాని అదేవిధంగా మనం మన పొరుగువలను
ప్రేమించలేము , కాని యేసు స్పష్టంగా మనకు ఆజ్ఞాపించెను
పొరుగు వారి ని ప్రేమించమని . "ఎవరు నా పొరుగువారు ?" మనకు దగ్గర గా ఉన్న వారు, మనం రొజు చుస్తున వారు , మన తొ పాటు పని చెస్తునవారు , అలనె
విదెసియులు కూడ “మీ మధ్య నివసించు పరదేశిని
మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప
వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై
యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను “లేవీకాండము - 19 : 34
అంటె దాని
అర్దం , మనం ప్రతి ఒకరికి దేవుని ప్రేమను చూపించాలి , వారు క్రైస్తవులు అయిన అవ్వకపొయిన కుడ మనం వారిని ప్రేమించాలి .
చాల మంది పొరుగువారు నిజమైన ప్రేమ కొసం ఎదురుచుస్తున్నారు, మనం మన
పొరుగువారిని ప్రేమించడం వలన , వారికి మన మీద నమ్మకం పెరుగుతుంది అలగె మనకు వారి గురించి ఎక్కువ తెలుసుకునే
అవకసం ఉంటుంది . మనము దేవుని
పిల్లల ము గ ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం
పాటించాలి , దాన్ని బట్టి మనం పొరుగు వరిని దేవును ప్రేమ
ము అలగె దేవుని యొక్క గొప్పతనమును మన జీవితం ద్వార చెప్పొచ్చు . మనం అందరం కూడ పొరువారిని ప్రేమించడం
నేర్చుకొనడం ఎంతైన అవసరం .
" ప్రేమ మాత్రమే పంపకం ద్వారా పెరుగుతుంది”
దేవుడు నిన్ను దీవించును గాక !
క్రీస్తు సేవ లో,
షకీనా యూత్